Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ్యాస్ కంపెనీ పెట్టుంటే చీకట్లు ఉండేవి కావు: బొత్స

విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, గ్యాస్ కేటాయింపులపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ అన్నారు. విద్యుత్ సమస్యపై శానససభలో జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు.  ప్రతిపక్షాలు వాస్తవాలు గుర్తుంచుకోవాలని సూచించారు. గ్యాస్ కేటాంపులు లేకే ఈ సమస్య నెలకొందన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ బిల్లులు కట్టలేదని రైతులను జైలులో పెట్టిన విషయాన్ని బొత్స గుర్తు చేశారు. అప్పట్లోనే గ్యాస్ కోసం ఒక కంపెనీ ఏర్పాటు చేసుకుని ఉంటే నేడు ఈ కష్టాలు వచ్చేవి కావన్నారు. 

More Telugu News